టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురుకాబోతోంది అంటూ.. మంత్రి కేటీఆర్‌కు ప్రశ్న ఎదురైంది.. దీనికి బదులిచ్చిన ఆయన.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. వైఎస్ షర్మిల పార్టీ.. వైఎస్‌ఆర్‌టీపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారొచ్చు అని వ్యాఖ్యానించారు.
Read Also: Weather Update : తెలంగాణవాసులకు కూల్‌న్యూస్.. మరో 4రోజులు వర్షాలు..
కాగా, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే త్రిముఖ పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు.. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని భావిస్తున్న గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ప్రణాళికులు వేశారని.. అందులో భాగంగానే బీజేపీ, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. కాంగ్రెస్ నేతలను సైడ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా.. తాము చేసిన అభివృద్ధి, కట్టిన ప్రాజెక్టులు.. సంక్షేమ పథకాలు మరోసారి తమను అధికారంలోకి తెస్తాయనే నమ్మకంతో ఉంది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని.. దేశవ్యాప్తంగా తెలంగాణపై చర్చ సాగుతుందంటున్నారు. అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ పథకాలను కాపీ కొట్టే మోడీ సర్కార్ అమలు చేస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు.