హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం…
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రో ధరల పెంపుపైన చేసిన ట్వీట్లపైన మంత్రి కేటీఆర్ స్పందించి ట్విట్టస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ ఉత్పత్తుల పైన తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పన్ను పెంచలేదని కేటీఆర్ ఓట్వీట్ చేయగా.. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా మరోవైపు 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉంటే… ఇప్పుడు కూడా…
తాండూరులో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సీఐ రాజేందర్‌రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపణలు రావడంతో పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. అయితే ఆ ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వాదిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌తో…
హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని పేర్కొన్నారు. 2030 లోపు…
దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై చర్చ సాగుతూనే ఉంది.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు.. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుపుతూ.. పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక, తెలంగాణలో పెట్రో ధరలకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పేరు ప్రస్తావించడంలో మంత్రి కేటీఆర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. దీంతో.. ప్రధాని మోడీకి సోషల్ మీడియా…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక విజనరీ కావాలి టెలివిజనరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని, మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు. దేశ ప్రజల కష్టాలను డబుల్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని, నరేంద్రమోదీ- రైతు విరోధి అంటూ ఆయన మండిపడ్డారు. నల్లధనం అని అడిగితే మోడీ తెల్లమొకం…
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు మినహా మరొకరులో లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన బార్ కోడ్ కలిగిన పాస్‌లను జారీ చేశారు. ఈ హైటెక్ పాసులు ఉంటేనే సమావేశం లోపలికి ఎంట్రీ.. లేకుంటే ఎంతటి వారికైనా..…
నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని ఆయన ఆరోపించారు. నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. వర్షాకాలం…
టీఆర్ఎస్ పార్టీ అవిర్భవ వేడుకలు ఈ నెల 27న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగనున్నాయి. మాదాపూర్ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున్న హజరుకానున్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లన్నీ టీఆర్‌ఎస్ స్వాగత తోరణాలతో గులాబిమయంగా మారాయి. ఎక్కడ చూసిన గులాబి వర్ణంశోభితంలా కనిపిస్తోంది. అయితే హెచ్‌ఐసీసీలోని ప్లీనరీ సభా…