గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా 6, 4, 2, 4 సాధించాడు. దీంతో తనలో పవర్ తగ్గలేదని ధోనీ చాటిచెప్పాడు. అయితే ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందని, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఆయన అన్నారు. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని…
ఈ నెల 6 ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభను నిర్వహించారు. అయితే రైతు సంఘర్షణ సభ స్థలాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీపీసీస రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆనాడు రజాకార్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల…
దోపిడీకి వ్యతిరేకంగా అప్పుడు నిజాం నవాబుని తరిమి కొట్టి ప్రపంచానికి చాటి చెప్పిన గడ్డ వరంగల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకే.. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పెట్టనున్నట్లు టీపీసీసీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం వరంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు.. రైతుల కోసం పెడుతున్న సభ అన్నారు. సభ విజయవంతం చేసేందుకు ప్రజలే బాధ్యత…
ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్‌లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం…
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్‌లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు…
కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది…
తెలంగాణ రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా మారింది. వరంగల్ బహిరంగ సభలో కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. నేను చెప్పేది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలి. నా మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా విసిరేస్తానన్నారు. కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం లక్ష 68 వేల…
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలను చుట్టేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.. వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుండగా… అంతకు ముందు కేటీఆర్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, కేటీఆర్ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లో.. టి.పీసీసీ నేతలు వరంగల్‌లో పర్యటించి రాహుల్ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఇవాళ్టి…
మెటావర్స్..! టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రసెన్స్ లేకపోయినా… అవతార్‌ల రూపంలో లైవ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్…