తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రిలో పర్యటించిన క్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టిన భిక్ష కేసీఆర్ కుటుంబానికి పదవులు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, కేటీఆర్ మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్లమెంట్ స్థానాలున్న టీఆర్ఎస్ పార్టీనీ జీవిత కాలం పోరాటం చేసిన తెలంగాణ వచ్చేది కాదని కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని ఆయన అన్నారు.
కేసీఆర్ కంటే ఎక్కువ కుమారుడు కేటీఆర్ విపక్షాలను లుచ్చా కుక్కలు అంటూ అహంకారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర దోపిడీదారుల వారసులు కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు. తెలంగాణ కోసం నాడు ఆత్మగౌరవ పోరాటం చేస్తే నేడు ఎమ్మెల్యే మంత్రులు కల్వకుంట్ల బానిసలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భునాధిగాని, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి సాగునీటి కాలువలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ప్రశ్నించిన వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు బనాయిస్తున్నాని ఆయన మండిపడ్డారు.