టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయని, మిషన్ భగీరథను అమలు చేస్తున్నాయన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ అని, హర్ ఘర్ జల్ కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు నేడు తెలంగాణ దిక్సూచిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
8 ఏళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని, ప్రతి మనిషి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారని, నల్లధనం తేస్తామన్నారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఉద్యోగాలు ఏవంటే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని కొత్త బాష్యం చెప్పారని ఎద్దేవా చేశారు. అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్నారు. వీటిపై కేంద్రాన్ని సమాధానం అడిగితే.. హిందుస్తాన్.. పాకిస్తాన్.. అక్బర్.. బాబర్.. బిన్‌లాడెన్.. అంటూ మతం చుట్టు రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.