Revanth Reddy: కేటీఆర్ కు రేవంత్ సవాల్.. ఆవిషయంలో ఎక్కడికైనా చర్చకు నేను రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ ను రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం కవితపై ఈడీ విచారణ బీజేపీ, బీఆర్‌ఎస్ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్ బీజేపీ ది మిత్రభేదమంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
Read also: Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్.. నేను రాలేనంటూ కవిత లేఖ
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై నేను చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా నేను ఆరోపణలు చేయనని అన్నారు. అమర వీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో గ్రూప్ లు లేవు, వివాదాలు లేవన్నారు. ఏ.ఐ.సీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు. బట్టి పాదయాత్ర. కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఠాక్రే కు లేఖ రాసిన విషయం నా దృష్టి కి రాలేదన్నారు. ఠాక్రే నాతో మాట్లాడలేదన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో మేం ఓట్లు అడగం, ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ అడగొద్దంటూ రేవంత్ ఎద్దేవ చేశారు. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
TS MLC Elections: బండిల్స్ పంపిణీలో గందరగోళం.. మొదటి రౌండ్ ఫలితాలు ఇక అప్పుడే..
తాజావార్తలు
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!