Minister KTR:మాఫియాను నడిపినట్లుగా మీడియాను నడుపుతున్నారన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌరవం ఉందని కేటీఆర్ అన్నారు. కానీ మీడియా యాజమాన్యాల గొంతు పట్టుకుని ఈడీ, సీబీఐ కేసులు వేస్తున్నాయన్నారు. వాళ్ళు ఏం చేయగలరు? మన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రభపై కేసులు పెట్టాయి. ఎవరినీ వదిలిపెట్టడంలేదు. మీకు ధైర్యం లేకపోవచ్చు.. మాకు ఉంది. నిజాలు చూపించే సత్తా మీకు లేకపోవచ్చు.. మాకూ ఉంది. వాస్తవాలను తప్పకుండా చూపిస్తాం. ప్రజల ముందు వారిని నగ్నంగా నిలబెట్టడం మన బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో మద్యం తాగి 42 మంది చనిపోయారు. ఇది స్కామా.. స్కీమా.. ఏమంటారో మీరే చెప్పండి అన్నారు. లేక అది మోడీ స్కీమా..? మరి అది మీV6లో చూపించావా..? అంటూ మీడియా ప్రతినిధిని ప్రశ్నించారు. వీ6లో ఏం మాట్లాడతారో.. ఏం చూపిస్తారో మాకు తెలుసు.. ఏం డ్రామా చేస్తారో మాకు తెలుసు.. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. వంద శాతం.రాష్ట్రంలో బీజేపీకి నోరు మెదపని చిల్లర సంస్థలు ఏవో.. ప్రజల ముందు ఎండగడతామన్నార మంత్రి కేటీఆర్. అది వెలుగా?.. వీ6.. ఇంకోట కాదు.. ఇక బీజేపీ కార్యాలయంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలపై నిషేధం విధించారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది అప్రజాస్వామికం కాదా? అని మీడియాకు ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి. ఈ దేశంలో ఎవరు ఆడించినట్లు పత్రికలు ఆడుతున్నాయని కేటీఆర్ నిలదీశారు.
మోడీని శ్రీలంక ఆరోపణలు చేస్తే ఒక్క పత్రికైనా రాసిందా..? ఒక్క మీడియా సంస్థ అయినా..? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకో నాకు తెలుసు.. మీ మీడిమా బాధను మేం అర్థం చేసుకోగలం. బీబీసీపైనే దాడి చేసినోడు మిమ్మల్ని వదిలేస్తాడా.. ఆయనకు మీరెంత? అంతేకాదు.. చాలా మందిని ఆయన కొనేశాడు. మిగతా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.
Komatireddys V/s KTR: అది నిరూపించే దమ్ము నీకుందా? కేటీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి సవాల్