Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi On Population Surged Due To Lack Of Electricity: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక వింత ప్రకటన చేశారు. కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగిందంటూ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ఆయన ఆ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గురువారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రహ్లాద్ మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. వాళ్లు ఉచితంగా కరెంటు ఇస్తారని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ తన హయాంలో సరిగ్గా కరెంటు సరఫరా చేయలేకపోయింది. ముఖ్యంగా గ్రామాలైతే అంధకారంలోనే ఉండేవి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండటం వల్లే మన దేశ జనాభా పెరిగిపోయింది. కానీ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము (బీజేపీ) 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయగలుగుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రహ్లాద్ జోషీ కరెంట్ కోతల విషయంలో కాంగ్రెస్‌ని విమర్శించడం వరకు బాగానే ఉంది కానీ, దేశ జనాభాతో దాన్ని లింక్ చేయడమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోని తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.
Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు
Also Read
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
కాగా.. కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు.. విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకు దిగారు. ఆయా హామీలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని మాటిచ్చింది. దీనిపై కౌంటర్ వేయబోతూ.. ప్రహ్లాద్ జోషి పై విధంగా స్పందించారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు కరెంట్ కోతలకి, జనాభా పెరుగుదలకి సంబంధం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ 24 గంటలు కరెంట్ ఉంటే, జనాభా పెరగదా? పిల్లలు పుట్టరా? అని నిలదీస్తున్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రహ్లాద్ వ్యాఖ్యలు మరింత జుగుస్పాకరంగా ఉన్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.
Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..