Naatu Naatu Song: దేశం మొత్తం ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డును సంబరాలు చేసుకుంటుంది. సెలబ్రిటీలంతా ట్రిపుల్ ఆర్ టీమ్‌కి శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాంగ్‌ను రాసిన చంద్రబోస్ కు కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పారు. అయితే.. అప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ పై మంత్రి కేటీఆర్ వార్నింగ్ డైలాగులు పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆయనతో పాటు ఆటలాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ సందర్భంగా రాజమౌళి బృందం ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేసింది.ఎన్టీఆర్ తలపై ముస్లిం క్యాప్ ధరించి కనిపించారు. బండి సంజయ్ వాటిపై తీవ్రంగా విమర్శించారు. ఆ సీన్లు మార్చకుంటే సినిమా ఆపేస్తామని కూడా హెచ్చరించారు. సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే కొడతామని అన్నారు. థియేటర్లకు ఎవరూ వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే..
ఆ సమయంలో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆస్కార్ లెవెల్లో ట్రిపుల్ టీమ్‌ని పొగుడుతూ బండిసంజయ్ చేసిన ట్వీట్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత గొప్ప కళాఖండంపై కొందరు విషం చిమ్మారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు రీ-ట్వీట్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కొణతం దిలీప్ గుర్తు చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇలాంటి ద్వేషపూరిత వ్యక్తులను దూరంగా ఉంచుదాం అని పేర్కొన్నారు.కాగా దిలీప్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసారు మంత్రి కేటీఆర్.. నాటు నాటు పాటకే మోడీకి అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాదులు చెబుతారని కేటీఆర్ అన్నారు. అప్పట్లో ట్రిపుల్ ఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఆస్కార్ విష్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ ఎండకు నీడ సరిపోదన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతల మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డును గెలుచుకునేదా..? ప్రపంచ వేదికపై భారతదేశం పేరు, తెలంగాణ పేరు మారుమోగుతుందా? ప్రస్తుతం అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. బెదిరించే వాళ్లే.. అవార్డు వస్తే సంబరాలు చేసుకోవడం బీజేపీకి ద్వంద్వ నీతి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023
Congratulations and best wishes to team @RRRMovie for clinching the best original song #NaatuNaatu at #Oscars . This moment is historic for Indian cinema and particularly for Telugu people. Proud of @Rahulsipligunj for his performance today which truly deserved standing ovation pic.twitter.com/4ICLiSMLNT
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 13, 2023