చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్‌కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్‌కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు.
Kakani Govardhan Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని.. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు.. ఇక, వెనుకవైపు లోకేష్ బాబు ఉండగా.. నాలుగో వ్యక్తిగా పాడె మోయటానికి పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, లోకేష్ బాబుకు వ్యవసాయ పంటల పేర్లు కూడా తెలియదు.. మరోవైపు చంద్రబాబు…
నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రీయేట్ చేసి ఈ యాత్ర.. నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.
ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసాతో కలిపి ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేస్తాం అని ఆయన వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో…