Kakani Govardhan Reddy: అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే చంద్రబాబు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అబద్ధానికి షర్టు, ప్యాంటు వేస్తే చంద్రబాబులా ఉంటుందని విమర్శించారు.. చంద్రబాబు జీవితం అబద్ధాలమయం.. జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు.. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు.. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదేళ్ల సీఈవోగా ఎదిగారని చంద్రబాబు చెప్పారు.. ఇంతకన్నా పచ్చి అబద్ధం వేరేది ఉందా? 1992లోనే మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల చేరారు.. అప్పటికి ఇంకా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రాలేదు.. ఇది అందరికీ తెలిసినా.. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాత్రం ఆగడంటూ మండిపడ్డారు.
Read Also: International Driving Licence : అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ఏమి జరిగినా అంతా తనవల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అని సెటైర్లు వేశారు మంత్రి.. దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే వాజ్‌పేయ్‌కు చెప్పానని కూడా చంద్రబాబు చెప్పుకుంటున్నారు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయం చూస్తే ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుస్తుందని.. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా..? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను జగన్ తీసుకొస్తే దానిపై విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ మీద చార్జిషీట్ వేయడానికి టీడీపీ నేతలకు ఏం అర్హత ఉంది అని నిలదీశారు కాకాణి.. టీడీపీ నేతల లాగా మేనిఫెస్టోను దాచలేదు.. ఇంటర్నెట్ నుంచి తొలగించలేదు.. మేనిఫెస్టోను చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏ ఏ పథకాలు వచ్చాయి అనే విషయాన్ని ఆరా తీస్తున్నాం అని వివరించారు. చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడారా? 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు అని ఆరోపించారు. కానీ, మేం నవరత్నాలు ఇస్తామని చెప్పి అన్నీ అమలు చేస్తున్నాం.. టీడీపీ నేతలు కోరుకున్న గ్రామానికి వెళదాం.. కుప్పం లేదా టెక్కలికి వెళ్లి చూద్దాం.. టీడీపీ మేనిఫెస్టో.. వైసీపీ మేనిఫెస్టో ఏవిధంగా అమలైందో చూద్దాం అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు చీము, నెత్తురు ఉంటే నా సవాల్ ను స్వీకరించాలి.. ఛాలెంజ్ చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?