Minister Kakani Govardhan Reddy Says YCP Will Definitely Win In 2024 Elections: 2024 ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేసినా.. వైసీపీకి పోయిందేమీ లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కంటే అధిక మెజారిటీతో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో రెండు రైతు బజార్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ మూస పోసిన విమర్శలకు అలవాటుపడ్డ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మూగబోయిన యువగళం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్‌వి పార్ట్‌టైం ఛాలెంజ్‌లని, వాటిని పట్టించుకోవక్కర్లేదని అన్నారు. పక్క రాష్ట్రాలవి కాపీ కొట్టడం చంద్రబాబుకి అలవాటు అని దుయ్యబట్టారు. ఖరీఫ్ రైతులకు అన్నీ అందుబాటులో ఉన్నాయని మంత్రి కాకాణి.. రైతు బజారుల ప్రారంభం వినియోగదారుడికి, రైతుకి ఉపయోగకరమని అన్నారు. ‘నాడు నేడు’ అభివృద్ధి లాగానే.. 5 కోట్ల వ్యయంతో రైతు బజార్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఏపీ వ్యాప్తంగా 103 రైతు బజార్లు ఉన్నాయన్నారు. ఏపీఐఐసీ కాలనీలో, మధురా నగర్‌లలో కూడా రైతు బజారుల్ని ప్రారంభిస్తామన్నారు. 184 దుకాణాలు రైతుల కోసం అందుబాటులోకి తెచ్చామని.. ముఖ్యంగా దివ్యాంగులకు స్టాళ్ళు కేటాయించామని మంత్రి చెప్పుకొచ్చారు.
Deadly lightning : మేఘాల మధ్య ప్రాణాంతకమైన మెరుపు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
అంతకుముందు కూడా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారని, అందుకే 2019 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఘోరంగా ఓడించారంటూ మంత్రి కాకాణి ధ్వజమెత్తారు. గతంలో జగన్ ఒక లక్ష్యం ప్రకారం పాదయాత్ర చేశారని.. కానీ లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం కానీ, ఒక ఉద్దేశం గానీ లేదని విమర్శించారు. ఓవైపు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే, మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టోనీ విడుదల చేశారని.. అది కూడా కర్ణాటక నుంచి కొన్ని, వైసీపీ మేనిఫెస్టోలోని కొన్నింటినీ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీతో దోస్తీ చేసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని.. గతంలో మోడీని తిట్టిన చంద్రబాబు, మళ్లీ ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. తన ఓటుకు నోటు కేసు గురించే కేంద్రంతో చర్చిస్తారని పేర్కొన్నారు.
PM Modi: ఈజిప్టుకు ప్రధాని మోదీ.. ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు పర్యటన