చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.
టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదు అంటూ విమర్శించారు.
తన పార్ట్‌నర్‌కు మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఆయనకు అండగా ఉండాలని భావించి సోమిరెడ్డి నిరసన చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఫండ్ అవసరమని భావించే భాగస్థుడి కోసం హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మంత్రి విమర్శించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం, అక్రమ కేసులు పెట్టడం లాంటి రాజకీయాలను చూశామని, నెల్లూరు ప్రశాంతతకు మారుపేరు అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.