బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. 2014 ముగ్గురూ కటయ్యారు.. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు.