టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో ఇద్దరూ చెప్పలేక పోతున్నారని ఎద్దేవా చేశారు..
Read Also: Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఓటింగ్ శాతంలో రికార్డ్..1952 తర్వాత ఇదే తొలిసారి..
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు మంత్రి కాకాణి.. అయినా ఉమ్మడి తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.. ఏ సీజన్ లో నష్టం వస్తే ఆ సీజన్ ల లోనే పరిహారం ఇస్తున్నాం అన్నారు.. ఇక, పవన్ కల్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు.. కొన్ని రోజులు కనపడటం.. మళ్లీ డెన్‌లోకి వెళ్లడం వారికి అలవాటు అంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. కాగా, ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేర్వేరుగా పర్యటించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన విషయం విదితమే.. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ఇద్దరు నేతలు.. దీంతో.. వారి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.