నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ వచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు…
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన సరే వడ్లు కొంటామని ముందుకొచ్చిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి మంత్రి హరీష్ రావు పర్యటించారు. మండల కేంద్రాలైన రాయపోల్, తొగుటలో 3.5కోట్లతో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలతో…
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు…
టీఆర్ఎస్ 21వ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. అందరూ ఊహించిన విధంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మాటల్లో అచ్చే దిన్ అని.. కానీ.. చేతల్లో సచ్చే దిన్‌గా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఆలోచనలో భాగంగానే చిన్న…
టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రధాన కూడళ్లు గులాబీమయంగా మారాయి. టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో టీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడించారు. నేడు ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తరని పలు పత్రికలు, న్యూస్ చానెళ్లలో వస్తోందన్న కేసీఆర్.. 75…
టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. నల్లధనం తీసుకువస్తామన్నారు, ఉద్యోగాలు ఉస్తామన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఇలా వీటిలో ఒక్కటైనా ఇచ్చిన హామీని నేరవేర్చారా అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో…
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో 4500 మందికి సరిపోయేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దశ దిశ చూపుతోందని ఆయన…
జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్ ద్వారా తెలిసిపోతుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమం, స్టడీ మెటీరియల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.. గ్రూప్ వన్, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా వ్రాత పరీక్షల ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తామన్న ఆయన..…
సిద్ధిపేట జిల్లా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం అనేది నా పదేళ్ల ప్రయత్నం 2018లో ఫలించిందని ఆయన అన్నారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. రూ.24 కోట్ల రూపాయల వ్యయంతో ఏన్సాన్‌పల్లిలో కేంద్రీయ విద్యాలయం కోసం నూతన భవన నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం…
తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్‌ను ఆడిపోసుకోవడం కాదు.. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించండని ఆయన సవాల్ విసిరారు. మూడు లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఎక్కడ ఇచ్చింది…? చెప్పండని ఆయన ప్రశ్నించారు. గ్రామాలకు నిధులు అంతా బీజేపీ సర్కార్ ఇస్తే.. దేశంలోని పల్లెలు…