నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు చాలా మంది ప్రజాప్రతినిధులు.. అందులో మంత్రి హరీష్‌రావు ఇంకా ప్రత్యేకమనే చెప్పాలి.. తన నియోజకవర్గంలోనే కాదు.. ఇతర నియోజకవర్గాల్లోనూ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు హాజరైన శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే, బిజీగా ఉండడంతో.. ఓ పెళ్లికి హాజరు కాలేకపోయారు మంత్రి హరీష్‌రావు.. దీంతో.. నూతన వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించారాయన. Read Also: Krishna Janmabhoomi-Shahi Eidgah: మథుర షాహీ ఈద్గా కేసులో జులై 20న విచారణ పూర్తి…
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు బీబీనగర్‌లోని ఎయిమ్స్ దవాఖానను మంత్రి హరీష్ రావు సందర్శిస్తారు. 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ (DPCU)ను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. అనంతరం…
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. అందులో ప్రభుత్వ డాక్టర్ల సంఘాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు తమ దృష్టంతా రాజకీయాలపై పెడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ఏర్పాటైన సంఘం పేరును వాడుకునే విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. పోలీసు కేసులు.. కోర్టులో విచారణ వరకు వెళ్లింది సమస్య. పైగా ఒకరిపై మరొకరు పదేపదే ఫిర్యాదులు చేసుకుంటూ శాఖాధిపతులకు కొరకరాని కొయ్యగా మారారు వైద్యులు. డ్యూటీలపై ఫోకస్ పెట్టకుండా…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ ఆఫీస్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బిజెపి అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా అని…
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మరోసారి బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామంలో లక్ష్మీనరసిహస్వామి విగ్రహా పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటారని, కాలేశ్వరం ప్రాజెక్టుకు కొందరు నాయకులు కోర్టుల్లో కేసులు వేసినా, దేవుని దయతో మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేశామని ఆయన…
గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని, రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని ఆయన వెల్లడించారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధికై…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, లింగారెడ్డి గూడలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా, రేవంత్ చీఫ్ అయ్యేవాడా… జీవితాంతం వాళ్ళు కేసీఆర్ కు రుణపడి ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు చివరి వరకు తెలంగాణ రాకుండా పని చేశాయని, ఇవ్వకుండా సతాయించాయని ఆయన ఆరోపించారు. అధికార యావ తప్ప ఒక్కడూ తెలంగాణకు ఏం…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. మంత్రి హరీష్‌రావు బుధవారం మాట్లాడుతూ.. బీజేపీ ఎందుకోసం యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలు పేదల…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల ఆకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతన్నకు నిరాశే మిగిలింది. అయితే.. తాజాగా మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రావొద్దని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో…
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే…