Telangana Finance and Health Minister Harish Rao Fired On Telangana BJP Chief Bandi Sanjay. బండి సంజయ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ప్రశ్నలు వస్తే తిట్ల పురాణం అందుకుంటున్నారని, కేటీఆర్ సవాల్ పై బీజేపీ నేతలు వాస్తవాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. 3,65,797 కోట్లు కేంద్రంకు తెలంగాణ రాష్ట్రం నుంచి…
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్‌ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన…
దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా స్థిరపడాలని, పారదర్శకంగా దళిత బంధును అందజేస్తున్నామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప పథకం దళితబంధు అని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ముందుకు వెళ్తుందని, దళిత బంధు కోసం బడ్జెట్లో 17800 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. దళిత బంధుతో దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఎదగాలని మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో పాటు వచ్చే అటెండర్లు మరియు బంధువులకు రూ.5కే భోజనం అందించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య అధికారులు, హరే కృష్ణ మూవ్‌మెంట్ (హెచ్‌కెఎం) మధ్య ఎంఓయు కుదిరింది. నగరంలోని ప్రభుత్వ తృతీయ ఆసుపత్రులలో రోగులతో పాటు వారి బంధువులకు, ప్రత్యేకించి దీర్ఘకాలం పాటు దీర్ఘకాలిక రోగులతో పాటు వచ్చే వారికి రూ.5కే పరిశుభ్రమైన భోజనం అందించనున్నారు. ప్రతి…
సంగారెడ్డి పట్టణ కేంద్రంలో దళిత యూనిట్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు దేశానికి ఆదర్శమని కొనియాడరు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు తప్ప ప్రజల అభివృద్ధి అవసరం లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లతోపాటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయండని…
ఆస్పత్రుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.. ఇక, మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజీలు వస్తాయని వెల్లడించారు హరీష్‌రావు.. త్వరలో పటాన్‌చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి…
తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు. రాష్టంలో టీఆర్‌స్ ప్రభుత్వం వచ్చాక…
బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లకు పచ్చకామెర్లు సోకాయంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులపై ధరల భారం పెంచారని మండిపడ్డారు.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?, తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా…
కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటి రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓట్లు వేయాలి..? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు.. ఇక, కష్టమైన సీఎం కేసీఆర్ రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ వడ్లు కొంటున్నారని ప్రశంసలు కురింపిచారు..…
తెలంగాణ టీఆర్‌ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు.…