మహబూబాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే మెడికల్ కళాశాలను, నూతన హాస్పిటల్‌కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. హరీష్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదని, మెడికల్…
వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావును అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను మంత్రులు హరీశ్‌రావు,…
బీజేపీ నేతలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న పాలమూరు మీటింగులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు.. బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ గురించి చెప్పడానికి తెలంగాణ వస్తున్నావా రాహుల్ అంటూ… మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పందిస్తూ.. తెలంగాణకు ద్రోహం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌లు ఏ పార్టీ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తున్నావ్.. అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ట్విట్టస్త్రాలు సంధించారు. పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో…
రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి హరీష్‌రావు.. పెద్దపల్లిలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాహుల్ ఎందుకోసం వస్తున్నావ్..? ఏం చెప్పడానికి వస్తున్నావ్..? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన…
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదేశానికి ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందన్నారు. రైతుల రుణమాఫీ చేయని…
తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నికొన్ని క్లిష్ట సమయాల్లో.. స్వయంగా తానే రంగంలోకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఓ సారి పుష్కరాల సమయంలో తానే స్వయంగా పుష్కరఘాట్ క్యూలైన్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చూశారు. అయితే ఆయనకు ఆయన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉందని అనడానికి ఈ ఫోటో నిదర్శనం. మంత్రి హరీష్ రావు ఈ…
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు….జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాట్టు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజ్జప్తిపై వెంటనే ముఖ్యంమంత్రి స్పందించి జీవో ఇచ్చారు…