టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. నల్లధనం తీసుకువస్తామన్నారు, ఉద్యోగాలు ఉస్తామన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఇలా వీటిలో ఒక్కటైనా ఇచ్చిన హామీని నేరవేర్చారా అని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంతో ఏ వర్గానికైనా ఉపయోగం కలిగించిందా అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఉన్న సంస్థలను అమ్ముకొని ఉద్యోగులను రోడ్డున పడేస్తుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏం చేసిందని, బండి సంజయ్ పాదయాత్రలో చెబుతారన్నారు. బండి సంజయ్‌ది కేవలం మేకపోతు గాంభీర్యమేనని.. బీజేపీ సంగతి ప్రజలకు, మాకు.. మాకంటే.. ఎక్కువగా బీజేపీ వాళ్లకే తెలుసునన్నారు.