Minister Botsa Satyanarayana: తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పరిపాలనను ఎన్నడూ చూడలేదు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలోని సోనియా నగర్‌లో 33.56 కోట్ల రూపాయలతో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను ప్రారంభించిన మంత్రి బొత్స.. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలు, పత్రాలు అందజేశారు.. ఇక, ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మంచి జరిగిన ప్రతీ కుటుంబం తమ ప్రభుత్వానికి అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు.. ఈ నాలుగు ఏళ్ల పది నెలల కాలంలో 2.90 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టు వెల్లడించారు.. దళారులు, మధ్యవర్తులు, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు..
Read Also: AP Assembly Speaker: రెబల్ ఎమ్మెల్యేల స్పీకర్ ఫైనల్ లెటర్.. విచారణ ముగిసింది.. ఇక చర్యలే..!?
ఇక, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పరిపాలనను ఎన్నడూ చూడలేదు అంటూ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కాగా, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమై వచ్చినా.. సింహం సింగిల్‌గా వస్తుందని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. వైనాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ.. వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం విదితమే.