Botsa Satyanarayana vs Ganta Srinivasa Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఓటమితోనే రాజకీయంగా నేను ఎదిగాను.. నా మీద విమర్శలు చేసేవాళ్ల కంటే పై స్థాయిలోనే వున్నాను.. అది వాళ్లు గుర్తించాలని హితవుపలికారు.. నాపై పోటీకి A టు Z ఎవరైనా ఒక్కటే.. స్వాగతించడానికి గంటా శ్రీనివాసరావు ఏమైనా ప్రత్యేకమా.. ఆయనకు ఏమైనా మూడు కొమ్ములు వున్నాయా? అంటూ సెటైర్లు వేశారు.. ప్రజలు తిరస్కరిస్తే నో.. ఓటమి భయం వుంటేనో నియోజకవర్గం మారాలి.. కానీ, నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నాను.. నన్ను అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Virat Kohli: ఐపీఎల్‌లో చిన్నగా మొదలైన కోహ్లీ జీతం.. ఇప్పుడు ఎంతో తెలుసా?
కాగా, మంత్రి బొత్స సత్యనారాయణపై ఈ నెల 6వ తేదీన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. చీపురుపల్లిలో తనపై పోటీ అంటే ఓడిపోవడానికేనన్న బొత్స వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన గంటా.. ఓడిపోయిన అనుభవం బొత్సకే వుంది.. ఒకసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్యేగా బొత్స ఓడిపోయారు అని గుర్తుచేశారు.. అంతేకాదు.. నేను గెలవడం తప్ప ఓడిపోవడం తెలియదన్న ఆయన.. సీట్లు ఫిక్స్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ నుంచి పోటీ అనేది తేలుతుందని చెప్పుకొచ్చారు.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యానారణ.. ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు కౌంటర్ ఇచ్చారు.