Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల్లో మాది (వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఒంటరి పోరాటమే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై చర్చలు సాగుతోన్న తరుణంలో.. ప్రతిపక్ష పార్టీలు ఏ డొంకల్లోకి, సందుల్లో కి దూరతాయో వాళ్ల ఇష్టం.. మా నైతికత మాకు వుంది.. ఎవరు ఎన్ని కూటములుగా వచ్చిన ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయమని అడుగుతున్నాం.. మీకు లబ్ధిచేకూరితేనే ఓటు వేయండి అని అడుగుతోన్న దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల సమయంలో జరిగిన అభివృద్ధిపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధం అన్నారు.
Read Also: Minister Botsa Satyanarayana: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
మరోవైపు, ఉద్యోగులకు బకాయిలు అనేది కొత్త కాదన్నారు మంత్రి బొత్స.. ప్రభుత్వంగా కొంత ఆలస్యం అయినా అన్ని పరిష్కారం చేస్తాం అన్నారు. పీఎఫ్ సహా అన్ని బకాయిలు ఒకటి రెండు నెలలో తీరుస్తాం.. కానీ, ఉద్యోగుల ఆందోళన ఎందుకో నాకు తెలియదు అన్నారు. ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరిపాం.. పీఎఫ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలు చెబుతున్నది వాస్తవం కాదని కొట్టిపారేశారు.సమ్మె వరకు ఉద్యోగ సంఘాలు ఎళ్ల కూడదనేది మా ఆలోచనగా చెప్పుకొచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.