టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు.
ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి. ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం…
ఏపీలోని మునిసిపల్ స్కూళ్ళ స్థితిగతులు మెరుగుపరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమావేశమైన మంత్రి బొత్స పలు ఆదేశాలిచ్చారు. మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ భేటీకి ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పలు సమస్యలపై…