ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి.
ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం ఎప్పుడూ జరగలేదన్నారు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్వి. విద్యార్థుల జీవితం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? పేపర్ లీక్ చేసిన వారిని అరెస్టు చేశారు అంటున్నారు. అలాంటప్పుడు పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలే ఈ లీకేజీ కి పాల్పడ్డాయి అని జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పారు.
ఆ విద్యా సంస్థలు పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. వీటన్నిటికీ మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఏబీవీపీ విద్యార్థుల పట్ల హెచ్చరికలు జారీ చేసారు. ఏబీవీపీని హెచ్చరించే దమ్ము బొత్సకు ఉందా? జిల్లాలో మీ ఇల్లును ముట్టడించడానికి వచ్చింది మీ నియోజకవర్గ ఓటరే. అది గుర్తు పెట్టుకో. యువతీ, యువకుల దౌర్భాగ్యం… బొత్స విద్యా శాఖామంత్రి గా రావడం. విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వడం పట్ల అసహనంతో ఉన్నారేమో దందాలు చేసిన శాఖలు ఇవ్వండని మీ నాయకుడిని అడగండి. ఏబీవీపీ సంస్థపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా క్షమాపణలు చెప్పండి. లేకపోతే ఏబీవీపీ , బీజేపీ రెండు సెగలు బొత్సకు తగులుతాయని హెచ్చరిస్తున్నా అన్నారు సురేంద్ర మోహన్.
Alliance Politics: పొత్తు పొడుపులు.. దెప్పి పొడుపులు