విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం ముగిసింది. ఉపాధ్యాయుల ప్రమోషన్ల వివాదం పై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు మంత్రి బొత్స. మూడో తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 12 వేలమంది సబ్జెక్టు టీచర్స్ అవసరమని గుర్తించాం.కొంతమంది ఉపాధ్యాయ సంఘ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ జీవోపై న్యాయస్థానానికి వెళ్లారు.
Read Also: Allu Arha: ఎవరనుకుంటున్నారు.. పుష్ప రాజ్ బిడ్డ.. ఆ మాత్రం ఉంటుంది
ఉపాధ్యాయులకు బదిలీల్లో ఇబ్బంది లేకుండా టీచర్స్ కి 2500 అలవెన్స్ లు కూడా ఇచ్చాము.ప్రజాస్వామ్యం లో స్వేచ్ఛ ఉంది ఎవరైనా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు .అయ్యన్నపాత్రుడు మాట్లాడిన తీరు సరిగా లేదు. రాజ్యాంగ పదవులు చేసిన వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు ఎన్టీఆర్ వర్ధంతిని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు .ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. జీవో నంబర్ 1 పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స.
Read Also: Elephants Violence: గజరాజుల విధ్వంసం.. వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు