ఏపీలో సంచలనం కలిగించిన తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ స్కాం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే నాకు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు…
వైఎస్సార్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సందడి చేశారు. ఈరోజు జరిగిన పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య విడివిడిగా వేడుకకు విచ్చేశారు. బాలయ్య గోల్డెన్ కుర్తాలో కన్పించగా, చిరంజీవి క్లాసీ లుక్ లో కన్పించారు. చిరు, బాలయ్య పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలిద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక హైదరాబాద్ లోనే జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు బండ్ల గణేష్ తో పాటు…
ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు. ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు అన్నారు సీఎం అభిప్రాయం మేం ప్రకటించాం.. సీఎం కు చెప్పేదేం లేదన్నారు.అహంకారం గా మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా…
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం చంద్రబాబు తహతహ లాడుతున్నారు… కానీ ఆయన భాష చూస్తే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారం ఎందుకు కోల్పోయామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు… సొంత నియోజకవర్గంలో ఓటమిపై సమీక్ష జరపకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అడిగి ఉండాల్సింది. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు పోయింది. ఆయనకు జవసత్వాలు లేవు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఇక జిమ్మిక్కులు ఆపాలి……
సీఎం అభిమతంతోనే కేబినెట్ వుంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కేబినెట్లో ఎవరు వుండాలి? ఎవరిని ఎప్పుడు దేనికి ఉపయోగించుకోవాలి. ఎవరిని విప్ లుగా నియమించాలి. ఎవరికీ సంతృప్తి, అసంతృప్తులు వుండకూడదు. పార్టీ బాధ్యతలు ఎప్పుడు ఎవరికి అప్పగించాలనేది సీఎం నిర్ణయిస్తారన్నారు. నూటికి నూరు శాతం పార్టీ లైన్ దాటి వెళ్లం. రాజకీయాల్లో పుట్టాను. నేను సీనియర్‌ని. సీఎం ఇష్టాయిష్టాలను మేం గౌరవించాలి. రాష్ట్రంలో ఎన్నో రాజకీయపార్టీలు వుంటాయి. మరో పార్టీ రావచ్చు. స్మార్ట్ సిటీలలో గేమ్స్ ని…
న్యూఇయర్ రోజు విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఒంగి తనకు నమస్కారం పెట్టడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది పెద్ద చిన్నా తారతమ్య సంస్కారానికి సబంధించిన అంశం అన్నారు. ఆయనేమీ నాకు సాష్టాంగం చేయలేదు, కాళ్లు పట్టుకోలేదు. వయసులో 20 ఏళ్ల పెద్ద వాళ్ళు కనిపించినపుడు వంగి నమస్కరించడం మన సంప్రదాయం అన్నారు బొత్స. సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే…
ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి…