Minister Anagani: రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర.. గత ఆరు రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మైక్రో లెవల్లో పర్యవేక్షించారు.
ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ఏపీ రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్ అవార్డులు సొంతం చేసుకుంది.. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ లో అవార్డుల ప్రదానం జరిగిందని తెలిపారు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ORCMS (ఆన్ లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్), రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు వచ్చాయని వెల్లడించారు.. వచ్చే నెల 20వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని…
ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..
గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు..
Minister Satya Prasad: రాష్ట్రంలో వెలుగు చుసిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ-స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Read Also:CM Chandrababu: నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..! ఈ నేపథ్యంలో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.. దీని కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున రూ.52 లక్షలు రెవెన్యూ డేకు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. రెవెన్యూ డే సందర్భంగా ప్రతీ రెవెన్యూ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు.. రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి
ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు..
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంఇ.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
వైఎస్ జగన్‌కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో…