Minister Satya Prasad: రాష్ట్రంలో వెలుగు చుసిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ-స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also:CM Chandrababu: నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..!
ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశం నిర్వహించారు. నకిలీ ఈ-స్టాంపుల సృష్టి మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్టాంపుల జారీ ప్రక్రియను పూర్తిగా పరిశీలించి, లోపాలను తేల్చాలని అధికారులను ఆదేశించారు. నకిలీ ఈ-స్టాంపులను ఎవరు తయారు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ చర్యలతో భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
Read Also:Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!