వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు
తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గోట్టిపాటి రవితో కలిసి దర్శించుకున్న మంత్రి అనగాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని పేర్కొన్నారు..
Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా.. గవర్నర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోరు.. వినుకొండ పర్యటన, గవర్నర్ ని కలవడం రాజకీయ లబ్ధి కోసమే చేశారు..