Minister Anagani Satya Prasad: కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు.. రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నందున దాతల సహాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నాం అని వెల్లడించారు. దాతల నుండి నిధులు ఎలా సేకరించాలి, ఎలా ఖర్చు పెట్టాలనే అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వారి పార్టీ కార్యాలయాలను కట్టకోవాలనే తపన తప్ప కొత్త కలెక్టరేట్లు కట్టాలన్న ఆలోచన చేయలేదు అని మండిపడ్డారు.. ఇక, వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనల నుండి ప్రజల దృష్టిని మరల్చించేందుకు అశాస్ర్తీయంగా జిల్లాల విభజన చేశారు. కానీ, జిల్లాల విభజనలో గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న లోపాలను వరుసగా సరిచేస్తున్నామని వెల్లడించారు ఏపీ రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.
Read Also: Somu Veerraju as MLC Candidate: ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ.. కాసేపట్లో నామినేషన్..