Minister Ambati Rambabu: టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏదో తేడా వచ్చింది.. అందుకే పవన్ అలా మాట్లాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక, పవన్ కల్యాణ్‌కు కు సీట్లు డిమాండ్ చేసే అంత సీన్ లేదని సెటైర్లు వేశారు. సొంతగా సీట్లు ప్రకటించే పరిస్థితి లేదు.. ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్.. చంద్రబాబు సంకలో ఎక్కి కూర్చున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు అంబటి రాంబాబు.
Read Also: Joy E Bike: సికింద్రాబాద్‌లో “జాయ్ ఇ-బైక్” షోరూమ్ ప్రారంభం..
మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డారు అంబటి.. షర్మిల ఓవరాక్షన్ చేస్తుందని వ్యాఖ్యానించిన ఆయన.. చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికి వైఎస్ షర్మిల ప్రయత్నం చేస్తుంది .. షర్మిల ఓవరాక్షన్ చూసి జాలి వేస్తుందన్నారు. వైఎస్ మరణంతోనే ఈ రాష్ట్రం లో కాంగ్రెస్ చనిపోయిందని వ్యాఖ్యానించారు.. షర్మిల వచ్చినా, దేవుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బ్రతికేది లేదు అని జోస్యం చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఎన్నికలకు దగ్గర పడుతోన్న సమయంలో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఒకరిని మరొకరు టార్గెట్ చేసి ఆరోపణలు, విమర్శలు చేస్తోన్న విషయం విదితమే.