Maharashtra Election Results: మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న పోరులో దక్షిణ ముంబైలోని వర్లీ ఒకటి. ఈ స్థానం నుంచి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో వెనకంజలో ఉన్నారు. శిండే శివసేన నే మిలింద్ దేవరా ఆధిత్యంలో ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఠాక్రే కన్నా కేవలం 600 ఓట్ల మెజారిటీలో దేవరా కొనసాగుతన్నారు. ఇప్పటి వరకు 17 రౌండ్స్‌లో 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
Milind Deora: శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ కలగానే మిగిలిపోతుందని శివసేన( షిండే) ఎంపీ మిలింద్ దేవరా శనివారం అన్నారు. నిన్న జరిగిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిపై ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ ఏ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినా తాను మద్దతు ఇస్తానని అన్నారు.
Milind Deora: 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు.
Congress: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019 నుంచి ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో కీలక నేత, కాంగ్రెస్‌తో 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న కుటుంబంలోని సీనియర్ నేత మిలింద్ దేవరా కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొదలుపెట్టే రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Milind Deora: కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా ఆ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. దీనిపై సీఎం షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరానుకుంటే అతడిని స్వాగతిస్తామని అన్నారు.
Milind Deora Quits Congress and join Shiv Sena Today: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం ఉదయం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన మిలింద్.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు మిలింద్ దేవరా చేరనున్నారని సమాచారం.…