Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా రాజీనామా.. నేడు శివసేనలో చేరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milind Deora Quits Congress and join Shiv Sena Today: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం ఉదయం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన మిలింద్.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు మిలింద్ దేవరా చేరనున్నారని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభ వేళ మిలింద్ పార్టీని వీడటం ఎదురుదెబ్బే అని చెప్పాలి.
‘ఈరోజుతో నా రాజకీయ ప్రయాణంలో ఓ ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలు’ అని మిలింద్ దేవరా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవరా కుమారుడే ఈ మిలింద్. కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకుల్లో మిలింద్ ఒకరు. దక్షిణ ముంబై లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో విజయం సాధించారు. 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2019లో శివసేన నేత అరవింద్ సావంత్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Aaron Finch: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆరోన్ ఫించ్.. జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్! ఇదే తొలిసారి
మిలింద్ దేవరా తన మద్దతుదారులు, కొంతమంది కార్పొరేటర్లతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారని తెలుస్తోంది. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా దక్షిణ ముంబై లోక్‌సభ స్థానాన్ని శివసేనకి కేటాయించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ వర్గం) కూటమిలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సీటు కేటాయిస్తే టికెట్ దక్కడం కష్టమనే భయాలు మిలింద్‌కు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరి.. టికెట్ సాధిస్తారనే ప్రచారం జరుగుతోంది.
Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of @INCIndia, ending my family’s 55-year relationship with the party.
I am grateful to all leaders, colleagues & karyakartas for their…
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) January 14, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!