Maharashtra Election Results: మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న పోరులో దక్షిణ ముంబైలోని వర్లీ ఒకటి. ఈ స్థానం నుంచి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో వెనకంజలో ఉన్నారు. శిండే శివసేన నే మిలింద్ దేవరా ఆధిత్యంలో ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఠాక్రే కన్నా కేవలం 600 ఓట్ల మెజారిటీలో దేవరా కొనసాగుతన్నారు. ఇప్పటి వరకు 17 రౌండ్స్‌లో 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
Read Also: Deputy CM Pawan Kalyan: మహారాష్ట్రలో ట్రెండ్ సెట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం..
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ స్థానం నుంచి 67,000 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బలమైన మిలింద్ దేవరాను శివసేన షిండే బరిలోకి దింపారు. దక్షిణ ముంబై ప్రాంతం దేవరా కుటుంబానికి బలమైన కంచుకోటగా ఉంది. మురళీ దేవరా 1984 మరియు 1991 మధ్య మూడుసార్లు ముంబై (సౌత్) సీటును గెలుచుకున్నారు, ఆపై 1998లో మళ్లీ గెలిచారు. మురళీ దేవరా తర్వాత ఆయన కుమారుడు మిలింద్ దేవరా ముంబై సౌత్ నుంచి కాంగ్రెస్ తరుపున 2004, 2009లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిలింద్ దేవరా షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.