Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది.
Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు.
Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటి వెనుక ఉన్న ఏఐ సాంకేతికతను పవర్ ప్లాట్‌ఫారమ్ అని పిలవబడే దాని ప్రసిద్ధ సాధనాలతో అనుసంధానించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ఏఐని ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్న వారాల తర్వాత ఇది వస్తుంది. కొత్త డెవలప్‌మెంట్ పవర్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను తక్కువ అనుభవం లేదా కోడింగ్ అనుభవం లేకుండా అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. అంటే.. కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు…
Meta Layoffs: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాడానికి వేలాదిగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్లాన్ చేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో 13 శాతం అంటే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 11,000 మంది ఉద్యోగులు కొలువుల నుంచి తీసేసింది. తాజాగా రెండో రౌండ్ కోతలను షురూ చేసింది మెటా. పెద్దమొత్తంలో ప్యాకేజీలు అందుకుంటున్న మేనేజర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Twitter Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగాల కోతలు ఆ తరువాత మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొనసాగించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపుతూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఫైర్ చేస్తున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతేడాది తన సంస్థలో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపుగా 3000కు పైగా ఉద్యోగులను తొలగించింది.
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తన బ్లాగ్ ‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ సాధిస్తున్న విజయాలను గురించి ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోందని అన్నారు. దేశం పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ సాధించిన అద్బుతమైన పురోగతికి మించిన రుజువు లేదని పేర్కొన్నారు.
MyGate Lays Off: ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ…
Bill Gates is in love: బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ సతీమణి పాలా హర్డ్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్… ఏడాది నుంచి పాలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొని డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్ వయస్సు 67…
IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
Google Layoff: ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు…