Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్‌మెంట్‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.
అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్‌లను కంపెనీ తొలగించలేదని…
Microsoft: టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది.
మైక్రోసాఫ్ట్ తన ఎక్స్ బాక్స్ వీడియో గేమ్ కన్సోల్‌ను ఉపయోగించడానికి సైన్ అప్ చేసిన పిల్లల డేటాను చట్టవిరుద్ధంగా సేకరించి, తమ వద్ద ఉంచుకోవడంతో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ ఆరోపణలను పరిష్కరించేందుకు $20 మిలియన్ల జరిమానాను చెల్లిస్తుంది.
Microsoft: ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగులను తీసేశాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెంచే పరిస్థితి లేదని చెబుతున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఈ ఏడాది సాలరీ హైక్ ఉండదని చెప్పింది. దీనిపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల కష్టకాలం ఇంకా కొనసాగుతోంది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇళ్లకు పంపిన మైక్రోసాఫ్ట్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
LinkedIn: ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.
1996లో చార్లెస్ ఓ రియల్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఈ ఫోటో హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈ ఫోటోని బిలియన్ల మంది చూసారని అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటికీ వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్ తో కలిసి మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ఫ్రేమ్ ను వెంట తీసుకెళ్లాడు చార్లెస్.