Rain Alert: అలర్ట్.. మరి కొన్ని గంటల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
- నవంబర్ 12-15 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు
- నవంబర్ 12-15 మధ్య తెలంగాణలో వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అయితే.. నవంబర్ 9-15 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. దీనితో పాటు నవంబర్ 9-15 తేదీల్లో తమిళనాడు, నవంబర్ 13-15 తేదీల్లో కేరళ, మహేతో పాటు నవంబర్ 12, 13 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 10-12 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లో, నవంబర్ 10-11 తేదీలలో వాయువ్య పంజాబ్‌లో దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.
READ MORE:Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
కాగా.. జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్‌లలో కనిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఈరోజు మైదాన ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌లో 13.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో, రాబోయే నాలుగైదు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల కనిపించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
READ MORE:Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
నవంబర్ 12-15 మధ్య తెలంగాణలో వర్ష సూచన..
నవంబర్ 12 – 15 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ శనివారం సమాచారం వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..