Winter Weather: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
- తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
- భారీగా పెరుగుతున్న చలి తీవ్రత..
- రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డవుతున్నాయి. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Read Also: Constitution Day: నేడే భారత రాజ్యాంగ దినోత్సవం.. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన వేడుకలు
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
ఇక, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తి డిస్ట్రిక్ లో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడూ రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
Read Also: Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం
కాగా, మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతుంటాయి. కానీ, ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్‌లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. 10 ఏళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!