Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
Read Also: Marriage Record: 12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..
మెజారిటీ ఉద్యోగులు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పై ‘మాకు నమ్మకం లేదు దొర’అని అంటున్నారు. ఉద్యోగుల్లో కేవలం 26 శాతం సిబ్బంది మాత్రమే మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్‌లో ఒక నివేదిక పేర్కొంది. మిగతా 74 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ నాయకత్వంపై నమ్మకం లేదని తెలిపారు. అంతర్గత సర్వేలో గతేడాది అక్టోబర్ తో పోలిస్తే ఈ ఏడాది మరో 5 శాతం పడిపోయింది.
అవుట్‌లెట్ ప్రకారం, అక్టోబర్‌లో 58 శాతం నుండి 43 శాతం మంది ఉద్యోగులు మాత్రమే జుకర్ బర్గ్ కు మద్దతుగా నిలిచారు. ఆర్థికమాద్యం భయాల వల్ల, ఖర్చులను తగ్గించుకోవాలని మెటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 21,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి, తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను మూసేస్తోంది. నియామకాలను తగ్గించుకుంటోంది. రాయిటర్స్ ప్రకారం.. అధిక ద్రవ్యోల్భణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు కంపెనీ లాభాలను తిరోగమనం వైపు నడిపిస్తున్నాయి.