WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు. అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా కేవలం ఒకే ఒక్క స్కాన్ తో చాట్ హిస్టరీని బదిలీ చేసే కొత్త ఫీచర్ని తీసుకురాబోతోంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా క్లౌడ్ బ్యాకప్ ను బైపాస్ చేసి, మరో ఫోన్ లోకి చాట్ హిస్టరీని పంపే ఫీచర్ రానుంది.
అయితే ఇది ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన రెండు ఫోన్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుంది. రెండు పరికరాల మధ్య డేటా ప్రత్యేకంగా షేర్ చేయబడుతుందని మరియు బదిలీ ప్రక్రియలో పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుందని వాట్సాప్ గ్యారెంటీ ఇస్తుంది. మెటా ఈసీఓ మార్క్ జుకర్‌బర్గ్ రాబోయే ఫీచర్‌ను ఇటీవల వెల్లడించారు. ఉదాహరణకు మీకు ఐఫోన్ ఉంటే మరోక ఐఫోన్ కి మారాలని అనుకున్నప్పుడు.. కొత్త ఐఫోన్ తో పాత ఐఫోన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ హిస్టరీ వస్తుంది. ఇదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చాట్ ని బదిలీ చేయవచ్చు.
Read Also: Uniform Civil Code: “నౌ ఆర్ నెవర్”.. యూసీసీపై ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు..
గతంలో పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ లోకి వాట్సాప్ హిస్టరీ బదిలీ చేయాలంటే iCloud లేదా Google డిస్క్‌లో బ్యాకప్ చేసి ఉండాల్సి వచ్చేది. ఆ తరువా కొత్త ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. ఉదాహరణకు ఉచిత iCloud ఖాతాలపై 5 జీబీ వరకు పరిమితి ఉండేది. దీంతో 5 జీబీ కన్నా ఎక్కువ చాట్ హిస్టరీ ఉండే ఇబ్బంది ఎదురయ్యేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా పాత ఫోన్ లోని క్యూఆర్ ని కొత్త ఫోన్ తో ఒక్కసారి స్కాన్ చేస్తే మొత్తం హిస్టరీ వేగంగా, నిమిషాల వ్యవధిలో ట్రాన్స్ఫర్ అవుతుంది.
అయితే ఈ ఫీచర్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఐఓఎస్ ఓఎస్ ఉన్న ఐఫోన్ నుంచి మరో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్ కి మాత్రమే చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్ సాధ్యం అవుతుంది. ఇదే విధంగా అండ్రాయిడ్ ఫోన్ నుంచి ఆండ్రాయిల్ ఫోన్ కి బదిలీ సాధ్యం అవుతుంది. అయితే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కు మారడానికి వాట్సాప్ ఒక ప్రత్యేక సహాయ పేజీని అందిస్తుంది. ఇదే విధంగా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి మారడానికి సహాయపడుతుంది. వాట్సాప్ ఈ ఫీచర్ ని ఎప్పుడు విడుదల చేస్తుందనే ఖచ్చితమైన విడుదల తేదీని అందించలేదు. క్రమంగా బీటా టెస్టర్లను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.