Tele MANAS: మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’…
స్ట్రెస్ అంటే మనకు సాధారణంగా నెగటివ్ భావననే గుర్తుకు వస్తుంది .. ఆందోళన, నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి. కానీ సైకాలజీ మాత్రం మరో కోణాన్ని చెబుతోంది – స్ట్రెస్ కూడా మంచిదే! సరైన స్థాయిలో ఉన్న ఒత్తిడి మన సామర్థ్యాన్ని పెంచి, విజయానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం సందర్భంగా ఈ “మంచి ఒత్తిడి” అయిన యూస్ట్రెస్ గురించి తెలుసుకుందాం. యూస్ట్రెస్ అంటే ఏమిటి? “యూస్ట్రెస్” అంటే సానుకూల ఒత్తిడి. ఇది మనలో…
Andhra Pradesh Student Suicides: అవమాన భారం.. తల్లిదండ్రులు తిడతారనే భయం.. ఆ విద్యార్థుల ఉసురు తీశాయి. ఓ విద్యార్థి మద్యం తాగి వచ్చాడని అవమానించడంతో రైలు కింద పడ్డాడు. మరో విద్యార్థిని ట్యాబ్ దొంగిలించావని ఆరోపించడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లె ఉన్నత పాఠశాలలో సమీప గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అతడు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు.…
హైదరాబాద్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు SHREE TMT హైదరాబాద్ రన్ – మైండ్ ఓవర్ మైల్స్ పేరుతో 10K & 5K రన్ నవంబర్ 9న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన అంశం. అయినప్పటికీ మన సమాజంలో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, Orange Hub Events ఆధ్వర్యంలో SHREE TMT టైటిల్ స్పాన్సర్‌గా Mind Over Miles –…
10th Results : హైదరాబాద్ నగరంలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో విఫలమవుతాననే భయం ఓ లేత ప్రాణాన్ని బలితీసుకుంది. వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న సంజయ్ కుమార్ (15), ఫలితాల వెల్లడికి ముందే తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగియడంతో సంజయ్ సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే, మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయనే వార్త అతని మనసులో భయాన్ని నింపింది. స్నేహితులు…
న్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అరవింద్ (23) అనే వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. యువకుడు అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు.
Alzheimer: బాధను మరిపించే మతి మరుపు కొందరికి వరం అయితే.. మరికొందరికి మాత్రం మనిషికి శాపం. మరీ ముఖ్యంగా, మధ్యవయసు వారిలో వెలుగు చూసే ఈ తీవ్ర మతిమరుపు సమస్య అల్జీమర్స్. అంతవరకు గడిపిన జీవితాన్ని, పరిసరాలను, ఆఖరికి తమకు ప్రాణమైన కుటుంబ సభ్యులను కూడా మర్చిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి అల్జీమర్స్ కు సరైన చికిత్స లేదు. దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఈ తరుణంలో…