Tele MANAS: మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’ యొక్క ట్రోల్ ఫ్రీ నంబరు 14416 స్పష్టంగా కనిపించేలా వేషం ధరించింది. బాల్య దశ నుంచే సామాజిక స్పృహను పెంపొందించే ఈ ప్రయత్నం పలువురి దృష్టిని ఆకర్షించింది.
Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !
ఈ విషయం తెలియగానే.. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో ‘చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి, ఆకారణంగా ఆత్మహత్యలకు ప్రయత్నించే యువతకు ఎన్డీఏ ప్రభుత్వం ‘టెలీ మానస్’ కాల్ సెంటర్ ద్వారా మానసిక వైద్య నిపుణుల చేత ఉచిత కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. వారికి స్వాంతన చేకూర్చి, జీవితం పట్ల ఆశలను చిగురించేలా చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నో జీవితాలను నిలుపుతున్న టెలీ మానస్ పట్ల అవగాహన కల్పిస్తున్న చిన్నారి రవి శ్రీకి శుభాశీస్సులు తెలుపుతూ.. బాల్య దశ నుంచే సామాజిక స్పృహని నూరిపోస్తున్న రవి శ్రీ తల్లిదండ్రులకు అభినందనలని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు రవి శ్రీ వేషాధారణ ఫొటోను కూడా మంత్రి జతపరిచారు.
Bihar Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనం.. అధికారంలోకి వచ్చేది ఈ కూటమే..
మంగళగిరి పాఠశాలలో LKG చదువుతున్న చిన్నారి చి. ద్రాక్ష రావిశ్రీ ఫాన్సీ డ్రెస్ పోటీలలో వేసిన వేషం ఇది.
చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి అకారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి, ముఖ్యంగా యువతకు ఎన్డీయే ప్రభుత్వం “టెలి మానస్” కార్యక్రమం ద్వారా మానసిక వైద్య నిపుణుల చేత ఉచిత… pic.twitter.com/PoZjMqgDpX
— Satya Kumar Yadav (@satyakumar_y) November 11, 2025