గాంధీ భవన్‌లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్‌ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్‌కు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది.
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారికి ఆమె సమయం ఇచ్చారు. వారి నుండి పురందేశ్వరికి అద్భుతమైన స్వాగతం లభించింది.
బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు.
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు.