గాంధీ భవన్‌లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని.. అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు. ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కాటా కమిటీ ముందు ఉంచారు. ఇటీవల జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోలను కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి ఇచ్చారు.
Read Also: USA: ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
అనంతరం.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి 72 వేల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. మిగిలిన నాలుగు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తావా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ బొమ్మ పెట్టాల్సిందే అంటున్నాడు బండి సంజయ్.. ఎందుకు పెట్టాలని అడిగారు. బలహీనవర్గాలకు ఆరు లక్షలు తాము ఇస్తే.. 72 వేలు కేంద్రం ఇవ్వాలి.. ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వనే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే.. 12 పైసలు ఇచ్చే మీరు.. మా పేరు పెట్టాల్సిందే అంటున్నాడని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇండ్లు లేని వాళ్లందరికీ మీరు ఇండ్లు కట్టించండి.. మీ పేరే పెట్టుకోండి.. తమకు అభ్యంతరం లేదని అన్నారు. బీజేపీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యం.. 54 లక్షల కార్డులకేనని తెలిపారు. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి