ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ కలిశారు. ఈ సందర్భంగా.. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్యాక్రాంతమై, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని వారు పేర్కొన్నారు. దరిద్రమైన ధరణి వెబ్ సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గరి నుంచి కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రాలేదు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా.. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. అయితే.. ఈరోజు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు ఆయనను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తన ప్రచార జోరును పెంచారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు ప్రచారంలో ముందుకెళ్తుండగా, మరోవైపు పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని జడ్చర్ల డీసీఎం అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని..…
Delhi Medical Student : చావు ఎవరికి ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి.
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి…