అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారత్‌లో పర్యటించనున్నారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. పర్యటనలో భాగంగా.. భారతదేశం-యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగస్టు పదిన ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. పారిస్ స్పోర్స్ కోర్టు తీర్పు వాయిదా వేసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత.. ఇప్పుడు భారత పతక విజేతలకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పతక విజేతలందరినీ త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ కలవనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు…
జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ బస్ భవన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు.. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం భారత క్రికెటర్లు స్వదేశానికి వచ్చారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ…
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్…