కొంతమంది టీచర్లు విద్యార్ధులతో విడదీయరాని అనుబంధం పెంచుకుంటూ వుంటారు. వారు కొంతకాలం కనిపించకపోతే విద్యార్ధులు అల్లాడిపోతారు. వారు బదిలీ అయితే.. ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తారు. బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు… ఇదంతా ఒక ఎత్తు.. కానీ మరికొంతమంది టీచర్లు ఛండశాసనులు.. వారంటే పిల్లలకు హడల్.. ఓ స్కూల్ టీచర్ ని చూస్తే విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. పాఠాలు నేర్పాల్సిన పంతులమ్మ తన పిడిగుద్దులతో విద్యార్థులకు,గ్రామస్థులకు చుక్కలు చూపిస్తుంది.
Read Also: Adivi Sesh: రెజీనా మ్యాగీ కామెంట్ కు ‘మేజర్’ షాకింగ్ రిప్లై.. నాకు స్టామినా ఎక్కువే
ఆ పాఠశాల పంతులమ్మను చూస్తేనే చాలు అందరూ జడుసుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులమ్మ తమ పట్ల సైకోలా ప్రవర్తిస్తుందనీ విద్యార్థులు వాపోతున్నారు.రేగోడ్ మండల ఎం.ఇ.వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల లోని ఉపాధ్యాయురాలు రజిత ను చూస్తే విద్యార్థుల గుండెల్లో గుబులు పుడుతుంది. చదువు,సంస్కారం,క్రమశిక్షణ నేర్పడంలో విద్యార్థులను దండిస్తుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. గ్రామర్ చెప్పే పంతులమ్మ సైకోలా ప్రవర్తిస్తూ విద్యార్థులను దండిస్తుందంటే మీరు నమ్మగలరా. కానీ ఇదే నిజం.

ఈ పాఠశాలలోని పంతులమ్మ రజిత మానసిక అనారోగ్యానికి గురై సైకోలా ప్రవర్తిస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అకారణంగా తమపై చేయి చేసుకుంటుందని విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయురాలు రజితను నిలదీసేందుకు వెళ్లగా పిల్లల తల్లితండ్రులపై కూడా రజిత చేయి చేసుకున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఆరోపిస్తున్నారు.
Read Also:Icrisat: ఇండియాలోనే తొలిసారి.. పల్లీలను ఎక్స్‌రే తీసి క్వాలిటీ అందిస్తామంటున్న ఇక్రిశాట్
గత 8 నెలలుగా రజిత తమను వేధిస్తోందని విద్యార్ధులు అంటున్నారు. ఉపాధ్యాయురాలు రజిత గ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు తాగి పాఠశాలకు వస్తుందని తాము పలుమార్లు తమ కళ్ళతో చూశామని గ్రామస్థులు ఎం.ఇ.ఓ కు ఫిర్యాదులు చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఎం.ఇ.వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయురాలు రజిత మాకొద్దు అంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎలాగైనా రజిత మేడంను బదిలీ చేసి తమను కాపాడాలంటూ తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎం.ఇ.వో ను కోరారు.