ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు వినూత్న ప్రచారం చేపట్టారు. కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోకపోతే రేషన్, పెన్షన్ పంపిణీ నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
Read Also: హైదరాబాద్‌లో మెగా జాబ్ ఫెయిర్… 75వేల మందికి ఉద్యోగాలు
దేశంలో ఇప్పటికే కోట్లాది మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని.. టీకాలపై ఇప్పటికైనా అపోహలను వీడాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. టీకా వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని.. కాబట్టి భయపడకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు. దేశంలో వివిధ వేరియంట్లు విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉండొచ్చని భరోసా కల్పిస్తున్నారు.