మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఫోన్ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్ ఊర చెరువులో దూకి విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.. నిన్ననే ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన శ్రావణి.. తనకు సెల్ ఫోన్ కొనివ్వమని తల్లిని అడగగా ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట వార్తలు వచ్చాయి.. కానీ, ఈ కేసులో శ్రావణి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు..
Read Also: Revanth Reddy: జయశంకర్ సొంతూరులో రచ్చబండ.. కేసీఆర్‌ను దంచుడే, దించుడే..!
తన కూతురిపై మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రావణి తండ్రి మల్లేశం.. నా కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని.. నా కూతుర్ని నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించారని ఆరోపిస్తున్నారు. గిరిబాబు, నర్సింగ్, తేజ అనే అబ్బాయిలు మా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారని చెబుతున్నారు.. ఇక, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రావణి తండ్రి మల్లేశం.. తన కూతురు ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుందన్నమాట వాస్తవం కాదని చెబుతున్నారు.